![]() |
![]() |

కొరియోగ్రాఫర్ మణికంఠ మాష్టర్ గురించి బుల్లితెర మొత్తానికి బాగా తెలుసు.. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ చూసే ఆడియన్స్ కి కూడా బాగా పరిచయమే. ఎక్కువగా పిల్లలతో డాన్స్ లు చేయిస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఢీ-13 లో మణికంఠ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తన తోటి కంటెస్టెంట్స్ కి కూడా ఒక ఇన్స్పిరేషన్ గా ఉండేవాడు. అప్పటి జడ్జి ప్రియమణి మణికంఠను జూనియర్ లారెన్స్ అని పేరు కూడా పెట్టింది. అలాంటి మణికంఠ మాష్టర్ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీలో కోరియోగ్రఫీ చేస్తూ ఉన్నాడు. ఇక ఇప్పుడు ఈ వారం ఎపిసోడ్ లో కూడా ముగ్గురు చిన్నారులకు డాన్స్ కోరియోగ్రఫీ చేసి అందరితో మంచి మార్క్స్ కొట్టేసాడు. ఇంద్రజ ఇక మణికంఠ పొగిడేసింది. " మీ లైఫ్ లోకి నిజంగా ఏంజెల్స్ వచ్చారు. మీరు ఎవరినైతే గాడ్ ఫాదర్ గా అనుకుంటున్నారో ఆయనతోనే పెర్ఫార్మ్ చేయించారు. ఇప్పుడు లారెన్స్ మాష్టర్ కూడా ఆయనకు మూవీ ఆఫర్ ఇప్పించారు" అంటూ ఈ సందర్భంగా ఒక విషయాన్ని కూడా రివీల్ చేసింది.
"లారెన్స్ మాష్టర్ నాకు ఒక సాంగ్ కోరియోగ్రఫీ చేయడానికి ఛాన్స్ ఇచ్చారు. ఐతే ఆ ఛాన్స్ ఎలా ఇచ్చారంటే శ్రీదేవి డ్రామా కంపెనీలో నేను చేసే పెర్ఫార్మెన్స్, కోరియోగ్రఫీ చూసి ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్యూ సర్. ఇప్పటికి నేను ఈ స్టేజి మీదకు రావడానికి కారణం ఎవరు అనే విషయాన్నీ ఎపుడూ చెప్పలేదు. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అంటే దానికి కారణం పంచ్ ప్రసాద్. ఆయన ఎవరికీ తెలియకుండా చేశారు. కానీ ఈ విషయం ఇప్పుడు నేను అందరితో షేర్ చేసుకుంటున్నా.." అని చెప్పాడు మణికంఠ. "మణికంఠకు లారెన్స్ మాస్టర్ ఆఫర్ ఇవ్వడంలో ఏమాత్రం సంకోచం లేదు. ఎందుకంటే మనోడు ఏదైనా చేయగలడు..అటు సినిమా కోరియోగ్రఫీ ఐనా ఇటు స్టేజి కోరియోగ్రఫీ ఐనా చేయగలడు. కంగ్రాట్స్ బ్రదర్ ఆల్ ది బెస్ట్" అని చెప్పాడు హైపర్ ఆది.
![]() |
![]() |